BREAKING: రేపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీళ్లేనా?

by Shamantha N |   ( Updated:2021-07-06 08:42:45.0  )
BREAKING: రేపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీళ్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 7న(రేపు) మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా కేబినెట్‌లో 22 మందికి చోటు కల్పించే అవకాశాలున్నాయి. అలాగే పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేబినెట్ రేసులో వినిపిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా, శర్వానంద సోనోవాల్, నారాయణ్ రాణె, సీపీ సింగ్, లల్లన్ సింగ్, ఆర్సీపీ సిన్హాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

Advertisement

Next Story