- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
11 అంకెల మొబైల్ నెంబర్.. ట్రాయ్ సిఫారసు
ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ అంటే పది అంకెలే ఉండేవి. కానీ ఇక మీదట 11 అంకెలను కూడా ఉపయోగించుకోవచ్చని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫారసు చేసింది. అవసరమైనన్ని నెంబర్లను సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వస్తోందని ట్రాయ్ పేర్కొంది. కాగా, 11 నెంబర్ల ఫార్మాట్‌లో మొదటి నెంబర్ 9గా తీసుకుంటే 10 బిలియన్ల కొత్త నెంబర్ల సామర్థ్యం పెరుగుతుందని, 70 శాతం ఉపయోగించిన తర్వాత కూడా 7 బిలియన్ల కనెక్షన్లు ఇచ్చుకోవచ్చని ట్రాయ్ తన సిఫార్సుల్లో తెలిపింది.
వీటితో పాటు ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్ నుంచి కాల్ చేసేటపుడు ఫోన్ నెంబర్‌కు ముందు సున్నా ఉపయోగించాలని, అయితే మొబైల్ ఫోన్ల నుంచి కాల్ చేసేటపుడు మాత్రం సున్నా అవసరం లేదని చెప్పింది. ఇందుకోసం ఫిక్స్‌డ్ కనెక్షన్‌కు మొదటి అంకెగా ఉపయోగించిన అంకెను మొబైల్ నెంబర్ల కోసం వినియోగించవద్దని పరిమితి విధించింది. అంతేకాకుండా డాంగిల్స్ కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ల అంకెల సంఖ్యను 10 నుంచి 13 వరకు మార్చాలని ట్రాయ్ సిఫార్సుల్లో సూచించింది.