పోలీసుల ముందే నిందితుడి హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ముందే ఓ మూక ఒకరిని హతమార్చింది. కట్టెలతో బాది చంపేసింది. ఖుషినగర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ స్కూల్ టీచర్‌ను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తిపై మూక ఆగ్రహించింది. కట్టెలతో విరుచుకుపడింది. టీచర్‌ను చంపిన వ్యక్తిని దారుణంగా హతమార్చింది. కొందరు పోలీసులు ఆపడానికి యత్నించిన సాధ్యం కాలేదు. దెబ్బలతో నేలపై చలనం లేకుండా పడి ఉన్నప్పటికీ దాడి ఆగలేదు. దీంతో నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement