మహీంద్రా లాభాలు డౌన్!

by Harish |
మహీంద్రా లాభాలు డౌన్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3 శాతం క్షీణించినట్టు వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,311 కోట్లకు తగ్గిందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,355 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. తన అనుబంధ సంస్థలకు సంబంధించి ఆస్తుల బలహీనత, జాయింట్ వెంచర్లలో కొంత పెట్టుబడుల కారణంగా కంపెనీ లాభాలు తగ్గాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 10,935 కోట్ల నుంచి రూ. 11,590 కోట్లకు చేరుకుంది. నిర్వహణ మార్జిన్ 17.8 శాతానికి మెరుగుపడిందని కంపెనీ తెలిపింది.

‘ట్రాక్టర్ అమ్మకాల్లో బలమైన పనితీరు, వ్యయ నియంత్రణ కారణంగా మర్జిన్ మెరుగ్గా ఉందని, ప్రస్తుత త్రైమాసికంలో ఇతర ఆదాయాలు గణనీయమైన పతనాన్ని చూసినప్పటికీ లాభాలు కేవలం 3 శాతమే తగ్గాయని’ కంపెనీ వెల్లడించింది. పండుగ సీజన్‌లో ట్రాక్టర్ల డిమాండ్ మరింత బలపడుతుందని భావిస్తున్నాం. కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో సానుకూల దృక్పథం ఉందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed