- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీలో చేరను.. నేను కేసీఆర్‌కు నమ్మిన బంటును’
దిశ: హాలియా: ‘నేను కేసీఆర్‌కు నమ్మిన బంటును, నేను బీజేపీలో చేరతానని వస్తున్న వార్తలు అవాస్తవం’ అని ఎమ్మెల్సీ డాక్టర్ తేరా చిన్నపరెడ్డి అన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని తెలిపారు. గ్రూపు రాజకీయలు చేయడం తన నైజం కాదని, సాగర్ ఉపఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమని తెలిపారు. అందిరినీ కలుపుకుని పోతూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలపై చిన్నపరెడ్డికి సర్పంచ్‌లు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో ఆప్కాబ్ రాష్ర్ట మాజీ చైర్మన్విజయేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్పార్వతమ్మ, కౌన్సిలర్‌లు వెంకటయ్య, ప్రసాద్నాయక్, సర్పంచ్‌లు స్వాతి, శ్రీనివాసరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.