- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రాజ్యాంగ హోదాను అపహాస్యం చేసిన గుత్తా’
దిశ, న్యూస్‌బ్యూరో: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడి రాజ్యాంగ హోదాను అపహాస్యం చేస్తున్నాడని ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు అన్నారు. శాసమ మండలి స్పీకర్ పదవి బాధ్యతలు చేపడుతున్నవ్యక్తి ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడాని బీజేపీ ఖండిస్తుందన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గుత్తా రాజకీయాలు మాట్లాడాలని అనుకున్నప్పుడు తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని హితవు పలికారు.
శాసన మండలి కమిటీ హాల్‌లో మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసంకాదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్ల తరలింపులో ప్రముఖ పాత్ర అధికార పార్టీతో పాటు కాంగ్రెస్‌ది కూడా ఉందన్నారు.
కేసీఆర్ ఉండగా ఒక్క చుక్క నీళ్లు అదనంగా తీసుకుపోయే ప్రసక్తి ఉండదని మాట్లాడి వ్యక్తి, అదే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 30 టీఎంసీల నీళ్లు అక్రమంగా తరలిస్తున్నారని అధికారులు చెబుతున్నారని గుత్తా మాట్లాడడం అర్థరహిత్యమన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ దురుద్దేశంతోనే రెండు రాష్ట్రాల సీఎంలు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కేసీఆర్ రాజకీయ అవకాశవాదం కారణంగానే తెలంగాణ నష్టపోతుందన్నారు. బండి సంజయ్ రాసిన లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించి రెండు రోజుల్లో వాస్తవ విషయాలను తెలియజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆదేశించారని రామచందర్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.