- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.475 కోట్లు మింగేశారు : ఎమ్మెల్సీ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీటమునిగి తీవ్రనష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రభుత్వం అందజేసిన రూ.10 వేల ఆర్థికసాయంపై రాంచందర్‌రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరద బాధితుల పేర్లతో రూ.475 కోట్లు మింగేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన రూ.75 కోట్ల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలా అని ప్రశ్నించారు. రూ.550 కోట్లు కూడా సరిగ్గా పంపిణీ చేయలేని పరిస్థితి తెలంగాణలో దాపురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి ఎలా అప్పగించారని అడిగారు. అంతేగాకుండా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ నాగాలాండ్‌లో రూ.17 కోట్ల స్కాం చేసిందని వెల్లడించారు.
Advertisement
Next Story