- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిరాశకరమైన బడ్జెట్: రామ్‌చందర్ రావు

దిశ, న్యూస్ బ్యూరో: బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిందని ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు అన్నారు. ఆదివారం అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 2020-21 ఆర్థిక బడ్జెట్‌లో గత బడ్జెట్ కంటే కొత్తగా ఏమీ లేదన్నారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలే ఉన్నాయన్నారు. వాటికే అంకెలు పెంచి బడ్జెట్ సంఖ్యను పెంచారని విమర్శించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానన్నా కేసీఆర్‌కు గుర్తుకు లేదేమో.. రూ.10వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. వాటితో వేటిని అభివృద్ధి చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. విద్యరంగాన్నినీరుగార్చే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ వేల కోట్లలో బకాయి ఉంటే కేవలం రూ. 2600కోట్లు మాత్రమే కేటాయిండం ఎంటని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు నిరాశ కల్పించేల ఉందన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలని రామ్‌రచందర్ రావు ఆరోపించారు.
tag: mlc ramchander rao, comments, budget