కలెక్టర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Sridhar Babu |
కలెక్టర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ,జగిత్యాల: జిల్లాలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రవికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. జిల్లాలో కరోనా కిట్ల కొరత కారణంగా అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారని, పరీక్షలు చేసిన వారిలో 30 శాతం మందికి కరోనా పాజిటివ్ వస్తుందని, దీంతో జిల్లాలో వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుందన్నారు. ఒక చల్‌గల్ గ్రామంలోనే ఎంపీపీ గంగారాం గౌడ్‌తో సహా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందడం ఆందోళనకర అంశమని, గ్రామంలో కరోనా ఏవిధంగా విస్తరిస్తుందో తెలుస్తుందన్నారు.

కావున జిల్లాలో ప్రతిరోజు చేసే కరోనా పరీక్షలను 5 వేలకు పెంచాలని కోరారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా చల్‌గల్ గ్రామంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి, కరోనా అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చినవారికి స్ధానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్యసేవలు అందించాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న 50 ఆక్సిజన్ పడకలను రెట్టింపు చేసి వంద పడకలకు పెంచాలని, అలాగే ఎంఐవి సామర్థ్యం గల 10 పడుకలను అందుబాటులోకి తేవాలని అన్నారు. రాయికల్, సారంగపూర్ మండలాలలోని మోడల్ స్కూల్స్, కస్తూరిబా పాఠశాలలో క్వారంటైన్ సెంటర్లను ప్రారంభించాలని జీవన్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed