ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌజ్ అరెస్ట్

by  |
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌజ్ అరెస్ట్
X

దిశ, కరీంనగర్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మంజీర ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. ఆనాడు ఆంధ్రా పాలకుల ఆధిపత్యంలో అణచివేయబడిన తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలన, కల్వకుంట్ల కుటుంబం చేతిలో బంధి అయ్యిందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిందని, నాటి 60 ఏళ్ల పాలనలో 60 వేల కోట్లు ఉన్న అప్పులు, స్వరాష్ట్ర సాధించుకున్న తరువాత 3లక్షల కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్ట్‎కు కాళేశ్వరం ద్వారా నీరందిస్తామని చెప్పి, ఇప్పటివరకు పనులు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. జగ్గారెడ్డి పిలుపు మేరకు తాను ఆ కార్యక్రమంలో పాల్గొని, ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్ళే క్రమంలో నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరయడమే అని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.

పోలీసులతో కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం:

జీవన్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేయడంతో జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం పూడురు క్రాసింగ్ వద్ద చొప్పదండి ఇన్‌చార్జీ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేయడవంతో పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మేడిపల్లి సత్యంతో పాటు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నిభందనలకు విరుద్దంగా వ్యవహరించారంటూ పోలీసులు వారిని స్టేషన్ కు రావాలన్నారు. దీంతో మేడిపల్లి సత్యం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిభందనలను ధిక్కరించి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీల వారిని మాత్రం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed