- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మోడీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారు.. అభినందనలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మోడీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారు.. అభినందనలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల: వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం హర్షనీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నల్ల చట్టాల రద్దు అంశం ముమ్మాటికీ రైతుల విజయమని పేర్కొన్నారు. ఏడాది కాలంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. ఆలస్యంగానైనా మోడీ వాస్తవాలను గ్రహించారన్నారు. చట్టాల రద్దుతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని జీవన్ రెడ్డి కేంద్రానికి సూచించారు. ఇక రాష్ట్రం ప్రభుత్వం రైతుల విషయంలో భేషజాలకు పోకుండా, రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
Next Story