నేడు ఆ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

by Shyam |   ( Updated:2021-02-15 22:33:11.0  )
నేడు ఆ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ,వెబ్ డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఈ రోజు నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. నేటి నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఇవ్వనున్నారు. కాగా మార్చి 14న రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.



Next Story

Most Viewed