- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రాన్ని సాధించింది కాంట్రాక్టర్లు,కమీషన్ల కోసం కాదు.
దిశ,మునుగోడు:
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాంట్రాక్టర్లు, కమిషన్లు, చెంచాగిరి కోసం కాదని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప ల్‌లో పట్టభద్రుల ఎమ్.ఎల్.సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడుతూ…
రాష్ట్ర సాధన కోసం,ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం నిర్విరామంగా పోరాటం చేసిన ఉద్యమ స్పూర్తితో ఉద్యమ ఆకాంక్ష ల సాధన కోసం, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాడుతానని తెలిపారు. అందు కోసం తనను శాసనమండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. నీళ్ళు, నిధులు, నియమకాలు మన ప్రాంతానికే దక్కాలని పోరాటం చేశామనీ,ఎన్నో నిర్భందాలను ఎదుర్కొని అనేక సార్లు జైలు పాలయ్యామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన తమ లాంటి వారిని అణగదొక్కాలని కేసిఆర్ చూస్తున్నాడని అన్నారు. ఇది ఉద్యమ స్పూర్తికి విరుద్ధమని అన్నారు. తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కకపోగా, ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా కాలరాయబడ్డాయని తెలిపారు.