- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓట్లు వేయించిన ఎమ్మెల్యేలు..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో 50 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఉదయం ప్రారంభమయింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ తోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను తీసుకు వచ్చి ఓట్లు వేయించడం గమనార్హం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో, మిగిలిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వారు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
824 మంది ఓటర్లు ఓటు హక్కును కోడ్ -కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. కోవిడ్ ఉన్నవారికి, వృద్దులకు, వికలాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఓటు హక్కు అవకాశం కల్పించారు.