- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానిపై కూడా సీఎం దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
దిశ, మునుగోడు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాల మూలంగా పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్లగొండ నుండి ప్రగతి భవన్‌కు చేపట్టిన నడకయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా కొయ్యలగూడెం గ్రామంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ… దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా రెండు ప్రభుత్వాలు కుట్ర పన్నాయని అన్నారు. దేశంలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
ఈ బిల్లులు అమలైతే దేశంలో రైతులు కార్పోరేట్ శక్తుల కింద పని చేసియాల్సిన దుస్థితి వస్తుందని, తిండి గింజలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ చట్టం అమలైతే ఉచిత కరెంట్ రైతులుకు ఇచ్చే అవకాశం కూడా ఉండదని అన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఒకే పన్ను విధానంతో తీసుకొవచ్చిన జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దేశంలో కేవలం పెట్టుబడి దారుల కోసమే పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సిరిసంపదలు కలిగిన రాష్టం అని కానీ ముఖ్యమంత్రి నేడు అప్పుల ఉబిలోకి నెట్టారని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తే ప్రీ ప్రైమరీ స్కూళ్లు నడపడానికి దోహదపడుతాయని అన్నారు. పైసా ఖర్చు లేకుండా జరిగే టీచర్ల బదిలీలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పోస్టులు కూడా భర్తీ చేయకపోవడంతోనే ఉన్నత విద్య పట్ల ముఖ్యమంత్రి శ్రద్ధ ఏపాటిదో తేటతెల్లం అవుతుందని విస్మయం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ… ప్రజా, ఉపాధ్యాయ, సమస్యల పరిష్కారం కోసం నడకయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నడకయాత్రలో వస్తున్న వినతులపై ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, నాగమణి, జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి నెక్కు సైదులు, ఉపాధ్యక్షులు మిర్యాల దామోదర్, బొమ్మగాని ముత్యాలు, పల్లె మోహన్ రెడ్డి, చౌటుప్పల్ మండల కార్యదర్శి గాసిరాం, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి అంజయ్య, అవ్వారు గోవర్ధన్, దొనూరి బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు కందుల మల్లారెడ్డి, యాదయ్య, సునంద, దామోదర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.