అండర్ వేర్, బనియన్‌తో ఎమ్మెల్యే.. రైలులో అసభ్యకరంగా తిరుగుతూ..

by Shamantha N |   ( Updated:2021-09-05 01:59:39.0  )
JDU MLA Gopal Mandal
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారేమో.. ఓ ఎమ్మెల్యే అందరి ముందు ఒంటినై బనియన్, డ్రాయర్‌తో తిరుగుతూ కనిపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కడుపు ఉబ్బరం. అందుకే అటూ ఇటూ తిరుగుతున్నా.. అంటూ నిర్లక్ష్యపు సమాధానాన్ని ఇచ్చి ఆయన పని ఆయన చేసుకున్నారు. ఇంతకూ ఇదంతా ఆ ఇంట్లోనో, పెరట్లోనే జరిగింది కాదు.. వందల మంది ప్రయాణిస్తున్న రైల్వే బోగీలో చోటు చేసుకుంది. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అంటే..

బీహార్ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ఇలా విచిత్రంగా ప్రవర్తించారు. తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి వెళుతున్నారు. అయితే ఆయన తన సీట్లో కూర్చోకుండా కేవలం బనియన్, కట్ డ్రాయర్‌ (అండర్ వేర్)తో బోగీలో అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులకు కనిపించారు. మొదట పట్టించుకోని ప్రయాణికులు ఆ తర్వాత అలా ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయితే మాత్రం ఇలా ప్రయాణికులు ఉన్న బోగీలో అసభ్యంగా తిరుగుతారా అని నిలదీశారు. ఇది ఇల్లు అనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే దుస్తులు వేసుకోవాలని హెచ్చరించారు.

Follow Disha daily Official Facebook page: https://www.facebook.com/dishatelugunews

MLA Gopal Mandal

మరోవైపు రైల్వే బోగీలో ఎమ్మెల్యే అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రయాణికులు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో రాజేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే గోపాల్ మండల్ స్పందించారు. తాను బనియన్, అండర్‌వేర్‌లో ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. తనకు కడుపు ఉబ్బరంగా ఉండడంతో బాత్ రూం వెళ్లొచ్చానని, ఆ సమయంలోనే అలా తిరిగానని వివరణ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే వివరణపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ‘‘అవునా.. కడుపు ఉబ్బరం ఉంటే బనియన్, అండర్ వేర్‌తో అటూ ఇటూ తిరిగితే సరిపోతుందా..? మరి ఎంబీబీఎస్‌లు చదవడం ఎందుకు అంటూ వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ట్రైన్‌లో ప్రయాణించాలంటే బనియన్, అండర్ వేర్‌ ఉంటే సరిపోతుందా.. మరి డ్రెస్ ఎందుకు అంటూ ఎమ్మెల్యేను చెండాడుతున్నారు. కాగా, ఈ ఘటన అధికార పార్టీ జేడీయూకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. అధికారంలో ఉండి ఇలా ప్రవర్తిస్తారా అంటే విపక్షాలు విరుచుకు పడుతున్నాయి.

చలాన్లలో సర్వీస్ ఛార్జీల వసూలుపై హైకోర్టులో కేసు

Advertisement

Next Story