- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే
దిశ, తాండూరు: ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నాయకులు చెప్తూనే ఉన్నారు. కానీ వారు మాత్రం పాటించడం లేదని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఆదివారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తమ్ముని కుమారుడు రవికుమార్ వివాహం బాణపూర్ గ్రామంలో జరిగింది. ఈ వివాహానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటుగా, చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా కోఆప్షన్ సభ్యుల జిల్లా అధ్యక్షుడు అక్బర్ బాబా, ముఖ్య నాయకులు నర్సిరెడ్డి(రాజు) ఎవరూ కూడా మాస్కులు ధరించలేదు.
మాస్కులు ధరించకపోవడం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. సమాజంలో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఈ విధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు తప్ప ఎవరూ కూడా మాస్కులు ధరించకపోవడం గమనార్హం.