- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, వెబ్ డెస్క్: అతను అప్పుడు డాక్టర్.. కానీ, ఇప్పుడు ప్రజాప్రతినిధి. అయినా కూడా తన వైద్య వృత్తిని మరిచిపోలేదు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి ఆ ప్రజాప్రతినిధి పురుడు పోశాడు. దీంతో ప్రస్తుతం ఆయనకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరు సూపర్ ఎమ్మెల్యే అంటూ అభినందనలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. మిజోరంలోని చాంపై నార్త్ నియోజకవర్గంలో ఇటీవలే భూకంపాలు సంభవించాయి. అదేవిధంగా పలువురు ప్రజలు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే జడ్ ఆర్ థైమ్సంగా పర్యటించారు. అయితే, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నాగూర్ గ్రామంలో ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నదని, అయితే.. ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరని.. అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారన్న విషయం ఎమ్మెల్యేకు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే ఆ గర్భిణికి పురుడు పోశారు. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.