- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధైర్య పడొద్దు.. నేనున్నా : ఎమ్మెల్యే పొదెం
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం జిల్లాలోని వెంకటాపురం మండలం ఏదిరా, తిప్పాపురం, కొత్తగుంపు, కలిపాక, ఆలుబాక గ్రామాల్లో పర్యటించి, ఆదివాసీలకు ఇంటింటికీ తిరిగి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆదివాసీల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి కష్టమొచ్చిన ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వారికి ధైర్యం చెప్పారు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆదివాసీలు ఇచ్చిన అంబలిని ఎమ్మెల్యే సేవించారు. అలాగే అటవీ ఉత్పత్తులను స్వీకరించారు.
tags : MLA podem veeraiah, distributes, essential commodities, poor people
Next Story