ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకోవాలి: ఎమ్మెల్యే పొదెం వీరయ్య

by Shyam |
ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకోవాలి: ఎమ్మెల్యే పొదెం వీరయ్య
X

దిశ‌, ఖ‌మ్మం: ఆప‌ద‌లో ఉన్న వారికి ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ‌వంతుగా సాయం అంద‌జేయాల‌ని ఎమ్మెల్యే పొదెం వీర‌య్య అన్నారు. భ‌ద్రాచ‌లంలో సోమ‌వారం ఎమ్మెల్యే దాదాపు వెయ్యి మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల‌ను పంపిణీ చేశారు. నిరుపేద‌లను ఆదుకునేందుకు త‌న‌వంతుగా కృషి చేస్తున్నాన‌ని అన్నారు. చాలామంది వ్యాపారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు అభాగ్యులను ఆదుకునేందుకు ముందుకురావ‌డం అభినంద‌నీయ‌మని కొనియాడారు. భ‌ద్రాచ‌లంలో ఎవ‌రికి ఎలాంటి క‌ష్ట‌మొచ్చినా 24గంట‌లు తాను వారికి అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు. లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లంద‌రూ స్వ‌చ్ఛందంగా పాటించాల‌ని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

tag: MLA Veeraiah, distributed, essentials, bhadrachalam

Advertisement

Next Story