నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది: వంశీ

by srinivas |
నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది: వంశీ
X

దిశ,వెబ్ డెస్క్: నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిపోయిందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నిమ్మగడ్డ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించాలే కానీ గృహ నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మనందరెడ్డి కాలం నుంచే ఉన్నాయని చెప్పారు. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలకు జీవో ఇచ్చింది చంద్రబాబేనని గుర్తు చేశారు.

Advertisement

Next Story