- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేకు నిరసన సెగ.. అరెస్టు చేస్తారా అంటూ రైతుల ఆగ్రహం
దిశ,ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని దళిత రైతుల సెగ తగిలింది. మందడంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఆమెను లింగాయపాలెం వద్ద దళిత మహిళా రైతులు, రాజధాని రైతులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీదేవి రాజధాని ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో జరిగేది ఫోటో ఉద్యమం మాత్రమేనంటూ విమర్శలు చేశారు. సీఎం జగన్‌తోనే రాజధాని అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రైతులెవరూ తమ సమస్యలపై తనను కలవలేదని చెప్పుకొచ్చారు. రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఇదిలా ఉంటే అసైన్డ్ కౌలు, అమరావతి పింఛను కోసం వినతి పత్రం ఇద్దామనుకుంటే అరెస్ట్‌లు చేస్తారా? అంటూ ఎమ్మెల్యేపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.