సింగూర్ వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..!

దిశ, ఆందోల్: సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రాజెక్టును సందర్శించారు. 9 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండడంతో ప్రాజెక్టుకు జలగంగ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల పరిషత్ అధ్యక్షురాలు చైతన్య రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సింగూర్‎కు జలాశయం సంతరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింగూరు్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు రైతులకు సాగునీరు అందుతోందని అన్నారు.

Advertisement