డీఎంకేకు షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే సెల్వం

by Shamantha N |
డీఎంకేకు షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే సెల్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ లీడర్ సెల్వం రాజీనామా చేశారు. అంతేకాకుండా పార్టీ అధినేత స్టాలిన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. డీఎంకేలో సీనియర్లకు మర్యాదా లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టాలిన్ కుమారుడు ఉదయనిధి చెప్పు చేతల్లో పార్టీ నడుస్తోందని ఆరోపణలు చేశారు. ఇన్ని రోజులు పార్టీ వారసత్వ పోరుతోనే నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం కుటుంబ తగాదాలతోనే చీలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు సెల్వం పాల్పడుతున్నారంటూ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో సెల్పం పార్టీకి రాజీనామా చేశారు. అటు కార్యకర్తలు సైతం ఆందోళనలో పడ్డారు.

Advertisement

Next Story