- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక నుండే చరమగీతం పాడాలి -సీతక్క
by Shyam |
X
దిశ, దుబ్బాక : దుబ్బాక నుండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ది అంతా ముత్యంరెడ్డి హయాంలో జరిగిందే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు. నిరుపేదలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అన్నారు. అందుకే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
Advertisement
Next Story