- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరాబర్ షెడ్లు కట్టి తిరుతాం.. జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
దిశ, జగిత్యాల: వీధి వ్యాపారుల సౌకర్యం కోసం పట్టణంలో షెడ్ల నిర్మాణం చేయబోతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధి నిరోధకుడిగా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిరిసిల్ల, మహబూబ్‌నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో రోడ్డు వెడల్పులో భాగంగా వీధి వ్యాపారులకు ఇబ్బందుల్లేకుండా చేశామని, అదే తరహాలో జగిత్యాలలో షెడ్ల నిర్మాణాలు చేపడుతుంటే వీధి వ్యాపారులను రెచ్చగొట్టి ప్రతిపక్ష నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
రాజకీయం కోసం వీధి వ్యాపారులను బలి చేయటం తగదని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రగతిని అడ్డుకోవటం సరికాదని సూచించారు. వీధి వ్యాపారులకు సంబంధించిన ప్రతి సమాచారం వీడియో, ఫోటోలతో సహా తమ వద్ద ఉందని ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వమే వీధి వ్యాపారులకు షటర్స్ నిర్మిస్తోందని అన్నారు. ధర్నాలు చేసే బీజేపీ నాయకులు జిల్లాకు ఒక నవోదయ గానీ, గురుకుల పాఠశాల గానీ తీసుకురావాలని సవాల్ విసిరారు. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాల సంగతేంటో ప్రజలందరికీ తెలుసని, క్రీడా మైదానం జీవన్ రెడ్డి హయాంలోనే పాడుచేశారని ఎద్దేవా చేశారు.
చట్టానికి లోబడి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్యే వీధి వ్యాపారులతో మాట్లాడారు. రాజకీయంగా ఉసిగొల్పే వారి మాటలు నమ్మి ఇబ్బందులకు గురికావొద్దని, రాష్ట్ర ప్రభుత్వం, తాను అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్, కౌన్సిలర్లు నవీన్, గంగసాగర్, శ్రీకాంత్, నవీన్, కో-ఆప్షన్ మెంబర్ రియాజ్ మామ, నాయకులు ముఖేష్ కన్నా, అలిశెట్టి వేణు, మతిన్, కూతురు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.