- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వచ్ఛంద సంస్థల సేవలు ఆదర్శనీయం : ఎమ్మెల్యే సంజయ్
దిశ, జగిత్యాల: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా రోటరీ-ఆపి-రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తోన్న సహకారం ఆదర్శనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో గానీ ఇతర(పాముకాటు, షుగర్, పోలియో) మూలంగా కాలు కోల్పోయిన దివ్యాంగులకు అవసరమైన జైపూర్ ఫుట్‌ను ఉచితంగా అందించడానికి ఆదివారం స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాకార్యదర్శి మంచాల కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కాగా, జైపూర్ ఫుట్‌ను ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబర్ 3న) రోజున అర్హులకు అందజేస్తామని మంచాల కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి డాక్టర్ నరేష్, డీఎస్పీ ప్రకాష్ , రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్, రోటరీ, సూర్యం, కాశీరావు, సురేందర్ రావు ఉన్నారు.