ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం

by Sridhar Babu |   ( Updated:2020-08-21 06:19:30.0  )
ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: సత్తుపల్లి మాధురి మెడికల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. అనతరం ఆయన మాట్లాడుతూ… ప్రకృతిని కాపాడుకోవడం మానవ ధర్మం అని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని తెలిపారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిమలను వాడొద్ద‌ని సూచించారు. అదే విధంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలందరూ ప్రభుత్వ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ, ఇంట్లోనే నిరాడంబరంగా పండగను జరుపుకోవాల‌ని సూచించారు.


Next Story

Most Viewed