- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీకి ఎమ్మెల్యే సవాల్.. అభివృద్ధి పై పోటీ పడి పని చేద్దాం
దిశ, నేరేడుచర్ల : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రోకర్లు వెళితేనే అధికారులు పని చేసే వ్యవస్థ ఉండేదని టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను లేకుండా చేశామని ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్లి పనులు చేయించుకుంటున్నారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి అన్నారు. ఆదివారం మఠంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు నిజాలను తెలుసుకోకుండా ప్రజలకు అబద్ధాలను నిజాలుగా చెప్తుంటే జనం నవ్వుకుంటున్నారని వాఖ్యానించారు.
రాజకీయ భవిష్యత్తు కోసం ప్రశాంతమైన తండాలలో రాజకీయ చిచ్చులు పెట్టడం ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి స్థాయికి తగదాన్నారు. నీకు చేతనైతే హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పోటీ పడదామని అన్నారు. ఇప్పటివరకు నువ్వు ఎంపీగా ఉండి నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చావో.. నేను ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని నిధులు తీసుకువచ్చానో ప్రజలకు వివరించుదామా..? అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి పదంలో సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కనీసం నియోజకవర్గంలో నలుగురు వ్యక్తులు కూడా లేని బీజేపీ పార్టీ టీఆర్ఎస్‌పై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ తల్లి, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి, పూలమాలవేసి అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి టీఆర్ఎస్ పార్టీ యువజన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సినియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, మాజీ ఎంపీపీ కొండా నాయక్, ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రమావతు రవిందర్ నాయక్, మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ శివశంకర్ నాయక్, బ్రహ్మ రెడ్డి, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్ నాయకులు, మహిళా అధ్యక్షురాలు నాగమణి , మండల సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సై యుత్ సభ్యులు, సోషల్ మీడియా బేత శివారెడ్డి పాండు నాయక్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.