నిమ్మగడ్డ చిన్నమెదడు చితికినట్టుంది : రోజా

by srinivas |
MLA Roja
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చిన్నమెదడు చితికినట్టుందని ఎద్దేవా చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను పక్కనబెట్టామనడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన మెచ్చి పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరగుతున్నాయని వెల్లడించారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్‌లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కమార్ పనిచేస్తున్నారని ఆరోపించారు.


Advertisement
Next Story

Most Viewed