వాలీబాల్ ప్లేయర్‌గా ఎమ్మెల్యే రోజా

by srinivas |   ( Updated:2021-11-05 05:32:09.0  )
వాలీబాల్ ప్లేయర్‌గా ఎమ్మెల్యే రోజా
X

దిశ, ఏపీ బ్యూరో: ఒకవైపు నటన మరోవైపు రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న రోజా ఈ మధ్య వీలు దొరికినప్పుడల్లా తన నియోజకవర్గంలో ఆట పాటలతో హల్ చల్ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల కాలంలో కబడ్డీ ప్లేయర్‌గా అవతారమెత్తిన రోజా, వాలీబాల్ ప్లేయర్‌గా మరో అవతారం ఎత్తారు. రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పుత్తూరు మండల వాలీబాల్ పోటీలను ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కార్యకర్తల సమక్షంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్‌ ఆడుతు క్రీడాకారుల్లో నూతనోత్సాహాం నింపారు. నవంబర్‌ 17న రోజా పుట్టిన రోజు సందర్భంగా ‘రోజా చారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వాలీబాల్ పోటీలు నవంబర్‌ 1 నుంచి 16 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

Next Story