- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ హామీ ఇస్తేనే పార్టీలో చేరా -ఎమ్మెల్యే రేగా

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం జిల్లా పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పలు కారణాల రీత్యా టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానంటేనే నాడు టీఆర్ఎస్‌లో చేరానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు హామీ ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై అధికారులు దాడులు చేయొద్దని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన దాడులు ఆగడం లేదని అన్నారు. పోడు ఉద్యమంలో భాగంగా తమ కార్యచరణపై వెనక్కిపోం అని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. ఫారెస్ట్ భూములపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే ఆదివాసీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.