క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే రవీంద్ర

by Shyam |
క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే రవీంద్ర
X

దిశ, దేవరకొండ: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా శనివారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్‌, క్రీడాకారులు, కళాకారులకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్విటి, ప్రధాన కార్యదర్శి తాళ్ళ శ్రీధర్ గౌడ్, ట్రెజరర్ క్రిష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story