- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచుల మొర.. వారిపై ఎమ్మెల్యే రసమయి సీరియస్
దిశ, మానకొండూరు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల సర్పంచులు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వద్ద మొరపెట్టుకున్నారు. గురువారం శంకరపట్నం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉమ్మెంతల సరోజ అధ్యక్షతన జరగగా.. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గడిచిన మూడు నెలల అభివృద్ధి పనులపై వివరాలను చదివి వినిపించారు. సమావేశానికి హాజరైన వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచులు విజయ్ కుమార్ రెడ్డి, కిషన్ రావు, రాజయ్యలతో పాటు పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాల్లో మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు, ఇంటర్నెట్, పైప్‌లైన్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పైపులైన్ల తవ్వకాలు చేపట్టడంతో గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించలేక పోతున్నామన్నారు.
దీనిపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలను విడుదల చేస్తున్నారని, మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సర్పంచులు ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాంట్రాక్టర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే సంబంధిత శాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో జయశ్రీ, సర్పంచులు కాటం వెంకటరమణారెడ్డి, సంపత్, వీరారెడ్డి, భద్రయ్య, అనూష, అనిత, వసంత, లత, మానస, సుజాత, రేణుక, అనిత, ఎంపీటీసీలు మోతే భాగ్యలక్ష్మి ,తిరుపతి , సంపత్ ,శోభారాణి, కో- ఆప్షన్ సభ్యుడు ఖాజా పాషా, గద్దపాక సింగిల్విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూర్ నియోజకవర్గం పంచాయతీరాజ్ డీఈఈ జనార్ధన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈజీ మొగిలయ్య, మిషన్ భగీరథ ఏఈ నాగరాజు, అంగన్వాడీ సూపర్వైజర్లు రాజశ్రీ, బ్లాండిన, ఈజీఎస్ ఏపీఓ శారద, విద్యుత్ శాఖ శ్రీనివాస్, కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.