డ్రగ్స్ కేసులో బడా నాయకులు.. రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్

by Shyam |   ( Updated:2021-09-06 04:24:44.0  )
డ్రగ్స్ కేసులో బడా నాయకులు.. రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బండి సంజయ్ యాత్ర నిన్నటికి 100 కిలోమీటర్లు పూర్తి అయిందని ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. ప్రజలు బీజేపీకి హారతులు పడుతున్నారు. ఈ యాత్రతో ప్రభుత్వం బీజేపీ చేతుల్లోకి వస్తుంది. బండికి ఎవరు ఎదురు వచ్చిన వారికే నష్టం జరుగుతుందని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికలు ఫిక్స్ కాకుండా చీఫ్ సెక్రటరీతో ఈసీకి తప్పుడు రిపోర్ట్ లు పంపించారని మండిపడ్డారు. సర్వే చూసి భయపడి వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వం మీరు నడుపుతున్నారా.. లేక మాఫియా నడుపుతుందా..? అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాతో రూ.25 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారని, ప్రజల రక్తం తాగి మరీ వసూలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్నీ అబద్దాలు చెప్తున్నారని చెప్పారు.

బంగారు తెలంగాణ పోయి మత్తు తెలంగాణ వస్తుందని, దూల్ పేట పేద ప్రజలకు 100 కోట్లు ఇస్తే పూర్తిగా మారిపోతదని చెప్పారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎంత పెద్ద నాయకులు ఉన్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి కనిపించడంలేదని, కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంక్ లను అమ్మేసిన పరిస్థితి గుర్తు చేసుకోవాలని చెప్పారు. వాట్సాప్ హాక్ చేసేందుకు కొత్త సాఫ్ట్ వేర్ కొంటున్నారని తెలిపారు. అన్ని పార్టీలకు ఈ రోజు భయం పుట్టిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణలో లేకుండా పోతుందని ఆరోపించిన రాజా సింగ్ పార్టీలు మార్చే అలవాటు బండి సంజయ్ కి లేదని చెప్పారు. కేవలం మీడియాలో ఉండేందుకు చీఫ్ కామెంట్స్ చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అంటే ఏ పార్టీతో అయిన చేతులు కలపడానికి సిద్ధమని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఎదురులేదని బండి స్పీడ్ గా వెళుతుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed