చార్మినార్ దగ్గర సభ పెట్టాం.. ఏం పీకారు : రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్

by Anukaran |   ( Updated:2021-08-30 05:57:11.0  )
raja-singh
X

దిశ, వెబ్‌‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాగానే ఎంఐఎం దొంగలను పాకిస్తాన్‌కు పంపిస్తామంటూ తీవ్ర కామెంట్స్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకు వారు జనగణమన పాడుతున్నారని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అప్పుడు ఏం చేస్తారో ఇప్పటి నుంచే ఆలోచించుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చార్మినార్ దగ్గర సభ పెట్టాం.. ఏం పీకారు అంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎంఐఎంకు రోజులు దగ్గర పడ్డాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story