అప్పటి వరకు పండుగలు చేసుకోకూడదా?: రాజాసింగ్

by Shyam |
అప్పటి వరకు పండుగలు చేసుకోకూడదా?: రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని ఇప్పుడు చెప్పడమేంటని.. అలాంటప్పుడు బక్రీద్‌కు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే వినాయక మండపాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పట్లో కరోనా తగ్గదని.. అప్పటి వరకు పండుగలు చేసుకోకూడదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ధూల్‌పేట గణేశ్‌ విగ్రహ తయారీదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed