- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైద్యుల సేవలు వెలకట్టలేం: రాజాసింగ్
by Shyam |

X
దిశ, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలను వెలకట్టలేమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం ఇసామియాబజార్‌లోని యూపీహెచ్ఓ సిబ్బందికి ఎమ్మెల్యే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు, సిబ్బంది వైద్యం అందిస్తున్నారని, దీంతో వారికి చేయూతనందించాలనే సంకల్పంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ నాయకులు శైలేందర్ యాదవ్, ఎస్పీహెచ్ఓ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర, మమత, రాధిక, మరియమ్మ, శారద, జయలక్ష్మి, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Next Story