వారసత్వ రాజకీయాల పై ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-11-11 11:58:01.0  )
MLA Raghunandan
X

దిశ,చౌటుప్పల్: తల్లి పోరాట స్ఫూర్తితో ఎదిగిన గొప్ప వ్యక్తి చత్రపతి శివాజీ అని, ఆయన పాలించింది ఏడేళ్లయినా.. కొన్ని వందల ఏళ్లుగా గుర్తు పెట్టుకునేలా బతికాడని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు అన్నాడు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడెం గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత శివాజీ ఆశయాలను, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

విశ్వ గురువుగా మార్చాలని ఆకాంక్షించిన నాటి నరేంద్రుడిని మాటను నిజం చేసిన వ్యక్తి నేటి మన ప్రధాని నరేంద్రుడు అని కొనియాడారు. ఆత్మ విశ్వాసంతో యువత తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తులు నాయకులుగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేరని, స్వశక్తితో వచ్చిన వారే నాయకులుగా దీర్ఘకాలంగా కొనసాగుతారని అన్నారు.ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేకుండా దుబ్బాక ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయిలో నిలబడ్డానని ఆయన తెలిపారు. సాలె పురుగును ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆయన సూచించారు.

ఆలస్యం అయినా పోరాట స్ఫూర్తితో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుందని యువతకు సూచించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు భారతదేశ జన సాంద్రత దృష్ట్యా కోట్లలో మరణాలు సంభవిస్తాయని అన్నారని,కానీ దేశ ప్రధాని పనితీరుతో కరోనా మహమ్మారిని ఎదుర్కొని వందకోట్ల మందికి వ్యాక్సిన్ వేయించగలిగమని తెలిపారు. ప్రపంచ చరిత్రలో దేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని,
కరోన మహమ్మారితో మానవ సంబంధాల విలువ అందరికీ అర్థమైందని అన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ మతాలకతీతంగా పాలన నడిపిన మహోన్నత వ్యక్తి చత్రపతి శివాజీ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, నారాయణపురం సర్పంచ్ సిఖిలమెట్ల శ్రీహరి,శేరిగూడం ఉప సర్పంచ్ కడ్తాల కృష్ణ,శివాజీ యూత్ సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed