టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by Shyam |
mla
X

దిశ, శంషాబాద్: దివ్యాంగులకు ఎల్లప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్‌లో వికలాంగులకు ట్రై సైకిల్లు, దుప్పట్లు, చేతికర్రలు, వినికిడి మిషన్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నరన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు కూడా పేద ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వికలాంగులకు నెలకు మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడు మహ్మముద్, సిద్ధప్ప, శ్రీనివాసులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed