వలస కూలీలను ఆదుకున్న ఎమ్మెల్యే

by Shyam |   ( Updated:2020-03-28 07:00:04.0  )
వలస కూలీలను ఆదుకున్న ఎమ్మెల్యే
X

దిశ, వరంగల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం నర్సంపేట పట్టణానికి వలస వచ్చిన కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదుకుని వారికి అండగా నిలిచారు. కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలను పెద్ది సుదర్శన్ పరామర్శించారు. తాత్కాలిక ఆర్థిక సాయం కింద రూ. 5 వేలు, క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఈ కుటుంబాలకు కరోనా వైరస్‌కు సంబంధించి వైద్య పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వారి కుటుంబాలు ఉండేందుకు నివాస ఏర్పాట్లు చేయాలని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్లకు ఎమ్మెల్యే సూచించారు.

tags : daily labour, mla peddireddy, corona tests, homes, 5000 help

Next Story

Most Viewed