- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూల్స్ బ్రేక్: ఇంటికి పిలిపించుకుని వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్మెల్యే

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు సైతం వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారు. తాజాగా నేడు(గురువారం) ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్ టీకా సెకండ్ డోస్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ టీకా తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. గురువారం ఆయన పీహెచ్‌సీ సిబ్బందిని ఇంటికి పిలిపించుకొని టీకా తీసుకున్నారు. దీంతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే.. ఈ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని టీకా తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందన్న కారణంగానే ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.