సమస్యల పరిష్కారానికే  ‘మీతో నేను’ కార్యక్రమం: ఎమ్మెల్యే 

by Sridhar Babu |
MLA Methuku Anand
X

దిశ, బంట్వారం: సమస్యల పరిష్కారానికై ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామంలో ఎమ్మెల్యే శనివారం పర్యటించారు. గ్రామస్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ లీకేజీల సమస్యను పరిష్కారం చేయాలని, నల్లాలకు మూతలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సూచించారు.

MLA Methuku Anand

సుల్తాన్ పూర్ గ్రామానికి ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని వికారాబాద్ డి.ఎమ్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, ఇళ్లపై వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేయాలని, గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.

MLA Methuku anand

పశువైద్యశాలలో డాక్టర్ అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని లేని యెడల చర్యలు తీసుకోబడతాయని పశు వైద్య అధికారిని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story