పల్లెలు కళకళలాడాలి… అదే సీఎం కేసీఆర్ లక్ష్యం

by  |
పల్లెలు కళకళలాడాలి… అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
X

దిశ, మెదక్: పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా కలకలలాడటమే, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్, రామయంపేట్, నిజాంపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజాంపేట మండలం చల్మెడ, నందిగామ, బచ్చురాజుపల్లి, తిప్పనగుల్ల, కే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లో డంప్ యార్డులు నూరు శాతం పూర్తి అయ్యాయని ఆమె అన్నారు.

వెంకటాపూర్ గ్రామ పాఠశాల ఆవరణలో మురుగునీరు నిలవడంతో పంచాయతీ కార్యదర్శి పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మురుగునీరు తొలగించాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చూడాలని, ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌కు చేర్చాలన్నారు. సేంద్రియ ఎరువుల తయారీ కోసం వానపాములను డంపింగ్ యార్డులో వదిలారు.



Next Story