కరోనా తగ్గుముఖం పడుతోంది.. రోడ్లపైకి రాకండి : ఎమ్మెల్యే నోముల భగత్

by vinod kumar |
MLA Nomula Bhagath
X

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆస్పత్రిని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తనిఖీ చేశారు. కాగా, ఈ నెలలో 4వ సారి సదరు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ వార్డుల్లో ఉన్న కొవిడ్ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భోజన సదుపాయాలు, ఇతర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో నియోజక వర్గ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్లపై తిరగకూడదని, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

కొవిడ్ వాక్సిన్, టెస్టుల కోసం వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలందరూ తప్పని సరిగా వాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని, ఇంట్లోనే ఉండి మహమ్మారిని జయించాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్నా కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మంద రఘువీర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed