- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా ఇమేజ్ డామేజ్ చేస్తున్నాడు.. అందుకే తిట్టా : మహిపాల్ రెడ్డి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించారు. తాను ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కావాలనే ఆ విలేకరి తనపై తప్పుడు కథనాలు ప్రచురించి నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
అందుకే అతనితో ఆవేశంతో మాట్లాడినట్లు వెల్లడించాడు. తనను బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురిచేసి కోట్లు సంపాదించాడని చెప్పారు. కావాలంటే విలేకరి కోట్లు సంపాదించిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఇదిలాఉండగా, మహిపాల్ రెడ్డి ఫొన్‌లో విలేకరితో అసభ్యకరంగా మాట్లాడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అతనిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది.
Next Story