- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే..ఎందుకంటే
by Shyam |
X
దిశ, ఆందోల్:
సింగూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కోరారు. ఈ మేరకు మంత్రిని కలిసి ఎమ్మెల్యే క్రాంతి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ఇటీవల కురిసిన వర్షాలకు సింగూర్ ప్రాజెక్ట్ లోకి 20 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. దీంతో ప్రాజెక్ట్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు వద్ద సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కాబట్టి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయలని కోరారు. ప్రాజెక్టు వద్ద వసతి గృహాలు, రెస్టారెంట్, బోటింగ్ వంటి వసతులను ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
Advertisement
Next Story