ఇద్దరిలో ఎవరు హీరో

దిశ, వెబ్ డెస్క్: టీడీపీపై ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా ఆయనతో చెపులతో కొట్టి తీవ్రంగా అవమానించారన్నారు. ఆ తర్వాత పార్టీతో పాటు పార్టీ గుర్తును లాక్కొన్నారని అన్నారు. ఎన్టీర్ పై చంద్రబాబకు ప్రేమలేదని ఉంటే ఎప్పుడో భారత రత్నకు సిఫార్సు చేసి ఉండేవారని అన్నారు. నేడు టీడీపీ నేతలు చేస్తున్న పనులకు ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందని తెలిపారు.

ప్రజా బలంతో అధికారంలోకి వచ్చేన సీఎం జగన్‌కు. వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు చాలా తేడా ఉందన్నారు. మీడియా‘మేనేజ్మెంట్‌తో చంద్రబాబు బతుకుతున్నారనీ, ఆయన తన పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో అద్బుతంగా 2 రూపాయలకే కిలో బియాన్ని ఎన్టీఆర్ తీసుకువచ్చారని, చంద్రబాబు మాత్రం ఆ పథకాలకు మంగళం పాడారని అన్నారు. చరిత్రలో వ్యవసాయం దండుగన్న సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారనీ, ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీకి అంగీకరించారని చెప్పారు. వెన్నుపోటు తో అధికారంలో కి వచ్చిన చంద్రబాబు హీరోనా…అఖండ విజయాన్ని సాధించిన జగన్ హీరోనా తెలపాలంటూ ప్రశ్నించారు.

Advertisement