- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: ఎమ్మెల్యే కిషోర్ కుమార్
మద్దిరాల దిశ న్యూస్ : రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని, మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కుంటపల్లి, గోరంట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ , పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న గౌడ్, జడ్పిటిసి సూరంభ వీరన్న గౌడ్, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీ రామ్ రెడ్డి, సర్పంచులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, దామెర్ల వెంకన్న, లవుడ్యా వెంకన్న నాయక్. ఎంపీటీసీలు శిరంశెట్టి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.