- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ దమ్ము వాటికే ఉంది.. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, శంకర్‌పల్లి: మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి మెమోరియల్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు సంకెపల్లి గ్రామంలో నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. కబడ్డీ పోటీల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు స్నేహ భావం పెరుగుతుందని వెల్లడించారు. యువకుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని సైతం వెలికి తీయగల దమ్ము క్రీడలకే ఉంటుందని అన్నారు.
గ్రామ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడ్రోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో వివిధ మండలాల నుంచి 32 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, స్థానిక సీఐ మహేష్ గౌడ్, ఎంపీటీసీ మేఘన సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విష్ణు పంతులు, వాసుదేవ్ కన్నా, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.